AP Liquor Policy : ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్న మహిళలు
AP Liquor Policy : ఈ కొత్త మద్యం విధానం కుటుంబాల్లో చిచ్చురేపుతుందని, తమ భర్తలు, కుమారులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళలు మండిపడుతున్నారు
- Author : Sudheer
Date : 03-11-2024 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt)..మందుబాబుల కోసం నాణ్యమైన మద్యాన్ని (AP Liquor Policy) అందుబాటులోకి తీసుకరావాలని ఉద్దేశ్యంతో సరికొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తుంటే..మహిళలు మాత్రం ఆందోళనలు చేస్తున్నారు.
ఈ కొత్త మద్యం విధానం కుటుంబాల్లో చిచ్చురేపుతుందని, తమ భర్తలు, కుమారులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళలు మండిపడుతున్నారు. మద్యం దుకాణాలు నివాసాల మధ్య ఏర్పడటంతో అక్కడి స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలాకాలో మహిళలు ధర్నా చేపట్టారు. ‘మద్యం దుకాణం’ వద్ద తమ పిల్లలతో కలిసి రోడ్డుపైకి చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టడంతో అక్కడి మద్యం విక్రయదారులకు షాక్ తగిలింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం యూ కొత్తపల్లి మండలంలో తాజాగా మద్యం దుకాణం ఏర్పాటయ్యింది. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చర్చిలు, మసీదు, అంగనవాడీ కేంద్రం ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్య విక్రయానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానిక మత్య్సకారులు వాపోతున్నారు. ఆదివారం ఈ ప్రాంతంలోని మత్య్సకార మహిళలు మద్యం దుకాణం తొలగించాలని ఆందోళన చేపట్టారు.
అటు పల్నాడు జిల్లాలో కూడా మహిళలు రాస్తారోకో చేపట్టారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో కేసానుపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో ఇటీవల కొత్త మద్యం దుకాణం ఏర్పడింది. సమీప గ్రామస్తులు వైన్ షాప్ ఏర్పాటు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మహిళలు తమ నిరసనలో “కుటుంబాలు ఉండే మధ్య మద్యం షాపు ఏమిటి?” అని నిలదీశారు. ఇలా వరుసగా మహిళలు రోడ్డు ఎక్కడం తో ప్రతిపక్ష పార్టీలు ఇదే ఆసరాగా చేసుకొని అధికార పార్టీపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు.
Read Also : AP Assembly Sessions : నవంబర్ 11 నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు