HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will Visakha Become An It Hub And Tirupati An Electronics Hub Minister Nara Lokesh

Nara Lokesh: విశాఖ ను ఐటి హబ్ , తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తా: మంత్రి నారా లోకేశ్

  • Author : Balu J Date : 15-06-2024 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh (2)
Nara Lokesh (2)

Nara Lokesh: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశాను. త్వరలోనే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తాము. విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను కోరా’’ అని లోకేశ్ అన్నారు.

‘‘ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వాలని కోరాను. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక ఇవ్వాలని అడిగాను. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని కోరాను. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడం పై కూడా రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని,యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పడిపోవడానికి గల కారణాలు అధ్యయనం తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వమని కోరాను. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై కూడా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించాను’’ అని మంత్రి లోకేశ్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP New Govt
  • nara lokesh
  • Tirupati

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

    Latest News

    • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

    • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

    • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

    • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd