HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will Pawan Kalyan Do Movies

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై పెద్ద బాధ్యతలు పెట్టిన చంద్రబాబు..సినిమాలు చేస్తాడా మరి..?

పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ ఉండేది..ఒక వేళ సినిమాలు చేసిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో

  • Author : Sudheer Date : 14-06-2024 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Movies Stop
Pawan Movies Stop

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ శాఖలన్నీ చాల ప్రాధాన్యం అయినవి. ఇంత పెద్ద బాధ్యతల నడుమ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందా..? అనేది ఇప్పుడు అభిమానుల్లో రేకెత్తిస్తున్న ప్రశ్న.

పదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్..మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా NDA కూటమి కి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సింగిల్ గా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగాడు. కానీ కేవలం ఒకే ఒక స్థానంలో ఆ పార్టీ నేత విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. చివరకు ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత అంత రాజకీయాల నుండి బయటకు వస్తారని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే వెతుకోవాలంటూ ఐదేళ్లు ఎంతో కష్టపడుతూ ప్రజల్లో నమ్మకం మూటకట్టుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుండి ఆయన గెలవడమే కాదు జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. అంతే కాదు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కూడా పవన్ కల్యాణే. అలాంటి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు కీలక పదవులు అప్పగించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయితీ,రూరల్ డెవలప్మెంట్ ,రూరల్ వాటర్ సప్లై ,అటవీ శాఖ, పర్యావరణ శాఖలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కల్యాణ్‌కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది. ఇంత బాధ్యత పెట్టుకొని సినిమాలు చేస్తాడా..? అనేది ఇప్పుడు చర్చ గా మారింది.

ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ ఉండేది..ఒక వేళ సినిమాలు చేసిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయా శాఖల పనితీరు ఫై రివ్యూ చేస్తూ..అధికారులను అప్రమత్తం చేస్తుండాలి. మరి ఇంత బిజీ సమయంలో సినిమాలు చేసే టైం ఏమాత్రం ఉండదు. సో ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాలు పూర్తి చేసి..ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాడు కావొచ్చు. చూద్దాం ఏంచేస్థాడో..!!

Read Also : Prabhas : ప్రభాస్‌తో ‘కన్నప్ప’ చేయాలని సీన్స్ రాసుకున్న కృష్ణంరాజు.. మోహన్ బాబు కామెంట్స్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Pawan Deputy cm
  • Pawan Kalyan
  • Pawan Kalyan Continue Movies

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd