HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will Kuppam Episode Benefit Tdp Politically

TDP and Kuppam:కుప్పం ఎపిసోడ్ తో టీడీపీకి లాభమా..? నష్టమా..?

టీడీపీకి కుప్పం కంచుకోట, ఆ పార్టీకి అక్కడ ఎదురే లేదు, తిరుగే లేదు. కుప్పంలో టీడీపీ తరఫున ఎవరు నిలబడినా గెలుస్తారు.

  • Author : Hashtag U Date : 26-08-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kuppam
Kuppam

టీడీపీకి కుప్పం కంచుకోట, ఆ పార్టీకి అక్కడ ఎదురే లేదు, తిరుగే లేదు. కుప్పంలో టీడీపీ తరఫున ఎవరు నిలబడినా గెలుస్తారు. నిన్న మొన్నటి వరకూ ఇవే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు సౌండ్ మారింది. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని ఆల్రడీ ఉదాహరణలతో సహా నిరూపితమవుతోంది. కుప్పం ఎంపీపీని సైతం టీడీపీ చేజార్చుకుంది. మున్సిపాల్టీలో కూడా పెత్తనం పోయింది. దీంతో సహజంగానే వైసీపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాని ఫలితమే తాజాగా కుప్పంలో జరుగుతున్న ఆందోళనలు.

ఒక పార్టీవారు మీటింగ్ పెడితే ఇంకో పార్టీ వారు కండువాలు కప్పుకెళ్లి.. తీరా వెళ్లాక డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసే సంస్కృతి ఏపీలో ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. చుట్టూరా పక్క పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు వారి నాయకుడిని విమర్శిస్తే అక్కడ ఉన్నవారు రెచ్చిపోతారు, ఏమైనా చేస్తారు. కానీ కుప్పంలో వైసీపీ కార్యకర్తలు తగ్గేదే లేదన్నారు. చంద్రబాబు ర్యాలీలో ఆయన్ని డౌన్ డౌన్ అన్నారు. ఆ ర్యాలీ వెళ్లే మార్గంలో వైసీపీ జెండాలు కట్టి తమ బలమేంటో చూపించాలనుకున్నారు. దీంతో బాబు టీమ్ కూడా రెచ్చిపోయింది. కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, చివరకు చంద్రబాబు రోడ్డెక్కారు.

ఎవరికి లాభం..?
పోనీ స్థానిక సంస్థల్లో ఏదో జరిగిపోయింది, చంద్రబాబు వస్తే అంతా సర్దుకుంటుందని కుప్పం టీడీపీ నేతలు అనుకుంటున్నా.. చంద్రబాబు వచ్చినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గడంలేదని ఈ పర్యటనతో రుజువైంది. చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారంటే, అక్కడ వైసీపీ ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు. యువకుడైన భరత్ కి అంత ఫాలోయింగ్ ఉందా, లేక మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగం అక్కడ ఫలించిందా, పోనీ సీఎం జగన్ కుప్పంపై పెట్టిన ఫోకస్ ఫలించిందా… వీటిల్లో ఏదో ఒకటి బలంగా నిలబడినట్టే చెప్పుకోవాలి. అందుకే కుప్పంలో తొలిసారి టీడీపీకి వణుకుపుట్టింది. తొలిసారి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నడిరోడ్డుపై కూర్చోవాల్సి వచ్చింది.

దాడులు, ప్రతిదాడులను ఎవరూ సమర్థించరు కానీ.. ఇక్కడ వైసీపీ తన బలం నిరూపించుకోడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. కుప్పంలో తమకు ఎదురే లేదనుకున్న టీడీపీ.. వైసీపీ జెండాలను చూసి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అధినేతకు కూడా అవమానాలు ఎదురైతే.. ఇక తమ పరిస్థితి ఏంటని ఇప్పటికే క్యాడర్ తమదారి చూసుకుంటోంది. పైగా కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారని గతంలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. ఆయనేమో అమిత్ షా తో కలసి భోజనం చేశారు. ఈ కన్ఫ్యూజన్లో టీడీపీ శ్రేణులు చెల్లాచెదరయ్యే అవకాశాలున్నాయి. దాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. కుప్పం నుంచి చంద్రబాబుని సాగనంపే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra politics
  • chandrababu naidu
  • kuppam episode
  • tdp

Related News

Minister Narayana fires on YCP

Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగుపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి… ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చ

  • CM Chandrababu is the person who made gems rain in Rayalaseema: Minister Nara Lokesh.

    Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Latest News

  • Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

  • Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

  • Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

  • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

  • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd