Ananthapuram : తన కళ్లముందే భర్త హత్య..కాసేపటికే ఆమె గుండెపోటుతో మృతి..
- Author : Sudheer
Date : 11-03-2024 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన కళ్లముందే భర్తను అతి కిరాతకంగా చంపడం చూసి..కాసేపటికి ఆమె గుండెపోటుతో మరణించిన ఘటన అందర్నీ కలిచి వేస్తుంది. నగరంలోని జేఎన్టీయూ (JNTU) సమీపంలో మూర్తి రావు గోఖలే (59), ఆయన భార్య శోభ (56) కొంతకాలంగా నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని …తన మేనల్లుడు ఆదిత్య దగ్గర కొన్ని రోజుల క్రితం డబ్బులు తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించకపోవడం తో కొద్దీ రోజులుగా మూర్తికి కి ఆదిత్య మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఉద్యోగం ఇప్పించకపోతే ఇప్పించకపోయావు..తీసుకున్న డబ్బులైన ఇవ్వు అంటూ ఆదిత్య వెంటపడుతున్నాడు.కొద్దీ రోజులుగా ఇదే నడుస్తుంది. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆదిత్య కత్తితో మూర్తిరావును గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్తను దారుణంగా చంపడంతో శోభ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాసేపటికి ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఇలా ఒకే రోజు దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also ; Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం