Wife Attack Husband : భర్త ప్రవేట్ పార్ట్‌లను కోసిన భార్య.. కారణం ఇదే..?
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్తపై భార్య దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో మొదటి
- Author : Prasad
Date : 22-07-2023 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్తపై భార్య దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసినందుకు ఓ భార్య భర్త ప్రైవేట్ పార్ట్‌లను కోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్‌బాబు అనే వ్యక్తి మొదట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాల కారణంగా వారు విడిపోయారు. ఐదేళ్ల క్రితం ఆనంద్‌బాబుకు వరమ్మ అనే మహిళతో వివాహమై ముప్పాళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తున్న సమయంలో వరమ్మ చూసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వరమ్మ వీడియోలు ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో వరమ్మ తన భర్త ఆనంద్‌బాబుపై బ్లేడ్‌తో దాడి చేసి అతని ప్రైవేట్ భాగాలను కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆనంద్‌బాబును వెంటనే నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు.