HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Why Bjp Is Keeping Mouth Shut In Ap

AP BJP : ఏపీలో బీజేపీ మౌనమేలనోయి ? భవిష్యత్ లో అడుగులు అటువైపే!

ఓ వైపు తెలంగాణలో బీజేపీ దూకుడుపై ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సైలెంట్ గా ఉంది. అటు అధికార వైఎస్సార్ సీపీని కానీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కానీ విమర్శించకుండా మౌనం పాటిస్తోంది. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది ?

  • Author : Hashtag U Date : 19-07-2022 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Somu Veerraju
Somu Veerraju

ఓ వైపు తెలంగాణలో బీజేపీ దూకుడుపై ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సైలెంట్ గా ఉంది. అటు అధికార వైఎస్సార్ సీపీని కానీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కానీ విమర్శించకుండా మౌనం పాటిస్తోంది. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది ? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బీజేపీ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. సింగిల్ ఎమ్మెల్యే కూడా లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు నూటికి నూరు శాతం ఓట్లు పడబోతున్నాయి. దీన్ని సానుకూల పరిణామంగా బీజేపీ జాతీయ నాయకత్వం.. వైఎస్సార్ సీపీ, టీడీపీ పై ఇష్టానుసారంగా విరుచుకుపడొద్దని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ తో జత కట్టబోయే పార్టీ ఏది ? అనే దానిపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. బీజేపీకి జనసేనకి మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. వైఎస్సార్ సీపీ పై బీజేపీ మౌనం.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జన సేనను ఇరకాటంలో పడేస్తోంది. ఈనేపథ్యంలోనే పార్టీ ఉనికిని నిలుపుకునేందుకు పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. టీడీపీ కూడా ఆన వాయితీకి విరుద్ధంగా.. ఇప్పటి నుంచే అభ్యర్థులను ప్రకటిస్తోంది. మరోవైపు చంద్రబాబు జిల్లాల బాట పడుతున్నారు. నారా లోకేష్ సైతం పాదయాత్రకు సిద్ధమయ్యారు. బీజేపీ మాత్రం మౌనంగా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఒకవేళ జనసేన , టీడీపీ తో జట్టు కడితే.. వైఎస్సార్ సీపీతో చేతులు కలిపేందుకూ కమల దళం సిద్ధమవుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా ఈ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. అక్టోబ‌రు 5న విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌కు ప‌వ‌న్ క‌ల్య‌ణ్ శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. అదేరోజు బీజేపీతో త‌మ పార్టీకున్న మిత్ర‌బంధాన్ని తెగ‌తెంపులు చేసుకుంటార‌ని వార్తలు వస్తున్నాయి. దీనిపై జనసేన వర్గాలు కూడా మౌనంగా ఉన్నాయి. వైసీపీవల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలిగిందనే విషయాన్ని పవన్ ప్రజలకు వివరించబోతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీలపై కలిసి పోటీచేసిన జనసేన, బీజేపీ ఇప్పుడు దూరం అయ్యాయి. కనీసం అవి రెండూ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వం పై మాట్లాడటం లేదు. అందుకే ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లాలని పవన్ డిసైడ్ చేసుకున్నారట. మరి వైఎస్సార్ సీపీపై బీజేపీ ఎలాంటి విధానంతో ముందుకు వస్తుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap bjp
  • janasena party
  • Pawan Kalyan
  • somu veeraju

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd