MP Seat : విజయసాయి స్థానంలో ఎవరొస్తారు..?
MP Seat : అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరపునే రాజ్యసభకు వెళ్లిన విజయసాయి, ఇప్పుడు ఎలాంటి రాజకీయ బందాల మధ్య ఈ పదవిని వదిలిచ్చారన్నదీ రాజకీయంగా చర్చనీయాంశమైంది
- By Sudheer Published Date - 02:12 PM, Wed - 16 April 25

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasaireddy) ఇటీవల తన పదవికి రాజీనామా(Resign) చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ స్థానం ఇప్పుడు ఎవరికి దక్కబోతుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. వైసీపీ(YCP)కి ప్రస్తుతం అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ ఉప ఎన్నికలో వారు పోటీ చేయడం అసాధ్యం. కనుక ఈ రాజ్యసభ సీటు ఎన్డీఏ కూటమికి దక్కనుంది అన్నది తేల్చుకుపోయిన అంశమే.
Aurangzebs Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?
ఈ సీటు బీజేపీ, టీడీపీ, జనసేన (AP NDA Alliance) మధ్య ఎవరికిస్తారన్నదే ఆసక్తికరమైన అంశం. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ స్థానం బీజేపీకి దక్కే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో బలం పెరగడం అత్యవసరం. పైగా ఏపీ బీజేపీ నేతలలో ఎవరో ఒకరికి ఈ అవకాశం అప్పుడే ఖరారైనట్టుగా తెలుస్తోంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంలోనూ ఇదే వ్యూహాత్మక ఆలోచన దాగి ఉండొచ్చు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మే 9న పోలింగ్ నిర్వహించగా అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
ఇక విజయసాయి ఈ రాజీనామా ద్వారా ఎవరికీ ఎంత పెద్ద మేలు చేశారో, ఆయనకు రాబోయే రోజుల్లో ఏమేరకు ఉపయోగపడుతుందో అన్నదీ ఆసక్తికరమైన విషయం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరపునే రాజ్యసభకు వెళ్లిన విజయసాయి, ఇప్పుడు ఎలాంటి రాజకీయ బందాల మధ్య ఈ పదవిని వదిలిచ్చారన్నదీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. వాస్తవాలు కొద్ది రోజుల వ్యవధిలో బయటకు రావొచ్చు కానీ ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త మలుపు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.