HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Will Solve The Case Of Veerappans Heirs Who Looted Red Sandalwood Bandi Sanjay

Bandi Sanjay : వాళ్లు వీరప్పన్ వారసులు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్

ఏపీలోని గత  వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Pasha Date : 11-07-2024 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay On Red Sandalwood Mafia

Bandi Sanjay : ఏపీలోని గత  వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం ఏపీలో వచ్చిందని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు ఖత సమాప్తం అయిందని పేర్కొన్నారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని సంజయ్ ఆరోపించారు. పుట్టినరోజు సందర్భంగా గురువారం రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్(Bandi Sanjay).. మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.  ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయిందని ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join

వైఎస్సార్ సీపీ హయాంలోని పాలకులను  వీరప్పన్ వారసులతో బండి సంజయ్ పోల్చారు. గత ఏపీ పాలకులు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని, ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చి చెప్పారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, తిరుపతి బీజేపీ(BJP) నాయకులు అనేక పోరాటాలు చేశార్నారు. కాగా, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read :Citibank – Axis Bank : జులై 15.. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లూ బీ అలర్ట్

‘‘మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కానీ హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేసి సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఊరుకోం’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘కొంతమంది ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో వేల కోట్లు సంపాదించారు. పార్టీలు నడవాలన్నా.. ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి వాళ్లు దిగజారారు. చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారు’’ అని ఆయన ఆరోపించారు.

Also Read :Kisan Vikas Patra: పోస్టాఫీసులో ఈ ఖాతా గురించి తెలుసా..? పెట్టిన పెట్టుబ‌డికి రెండింత‌లు రాబ‌డి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Red Sandalwood
  • Veerappans Heirs

Related News

Bandi Sanjay Turns Singer

Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

ఈ గీతం యొక్క పూర్తి వెర్షన్‌ను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనివల్ల నెటిజన్లలో

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    Telangana : తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది – బండి సంజయ్

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd