HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Water War Between Ap And Telangana On Jilledubanda Reservoir

కృష్ణా వాట‌ర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణంపై వివాదం

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

  • Author : Hashtag U Date : 05-10-2021 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలో తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం వ‌ద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజ‌ర్వాయ‌ర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. శ్రీశైలం నుంచి నీటిని తోడేందుకు మ‌రో రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం ఏపీ చేపడుతోంద‌ని ఫిర్యాదు చేసింది. తాజా రిజ‌ర్వాయ‌ర్ కు సంబంధించిన టెండ‌ర్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆహ్వానించింద‌ని తెలిపింది. రూ. 680 కోట్ల‌తో 2.41 వేల మిలియ‌న్ క్యూబిక్ అడుగుల సామ‌ర్థ్యంగ‌ల రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేపడుతుంద‌ని తెలంగాణ ఇరిగేష‌న్ శాఖ చీఫ్ ఇంజ‌నీర్ ముర‌ళీథ‌ర్ బోర్డుకు లేఖ రాశాడు. టెండ‌ర్ల‌ను నిలిపివేయాల‌ని సూచించాడు. దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య మ‌రోసారి నీళ్ల వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.
సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌, కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ఇచ్చిన అనుమ‌తుల ప్ర‌కారం కేవ‌లం 34టీఎంసీ నీళ్ల‌ను మాత్ర‌మే శ్రీశైలం నుంచి వ‌ర‌దల స‌మ‌యంలో మ‌ళ్లించ‌డానికి వీలుంది. కానీ, ఇప్ప‌టికే ఈ ఏడాది 82 టీఎంసీల నీళ్ల‌ను పోతిరెడ్డిపాడు ద్వారానూ హంద్రీనీవా, సుజ‌ల స్ర‌వంతి ద్వారా మ‌రో 11.2 టీఎంసీల నీళ్ల‌ను మ‌ళ్లించారు.
మొత్తంగా 93.29 టీఎంసీ నీళ్ల‌ను రాయ‌ల‌సీమ‌కు ఏపీ మ‌ళ్లించింద‌ని తెలంగాణ ఫిర్యాదు చేసింది. నీళ్ల మ‌ళ్లింపుపై అత్య‌వ‌స‌రంగా ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించాల‌ని కృష్ణాబోర్డుకు ముర‌ళీధ‌ర్ లేఖ రాయ‌డం వివాద‌స్పదం అయింది.
తాజాగా ఏపీ మ‌ళ్లించిన నీళ్ల కార‌ణంగా శ్రీశైలం, నాగార్జున‌సాగ‌ర్ ప‌రిధిలోని తెలంగాణ ప్రాంతం న‌ష్ట‌పోతుంద‌ని కృష్ణాబోర్డుకు రాసిన లేఖ‌లో తెలంగాణ పొందుప‌రిచింది. త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • cm jagan
  • jilledubanda reservoir
  • telangana news
  • water war between ap and telangana

Related News

Illegal Affair News

తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య

AP News  చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల

  • vande bharat trains bomb threat

    వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd