HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Wardens Husband Rapes Students

Dayananda Saraswati Hostel : విద్యార్థునులపై వార్డెన్ భర్త అత్యాచారం..?

Physical Harassment : హాస్టల్ లో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నట్లు బయటకు వచ్చింది

  • By Sudheer Published Date - 10:18 AM, Wed - 18 September 24
  • daily-hunt
Physical Harassment
Physical Harassment

Warden’s Husband Rapes Students..? : దేశ వ్యాప్తంగా మహిళలకు , అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది జరిగేలాలేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే కాదు స్కూల్ , హాస్టల్స్ ఇలా ప్రతి చోట ఇదే జరుగుతుంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌ (Dayananda Saraswati Hostel)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ లో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ (Shasi Kumar) విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నట్లు బయటకు వచ్చింది.

బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశి కుమార్.. ప్రైవేట్ గా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్ కు తన భార్య మణిశ్రీని వార్డెన్ గా పెట్టి నడిపిస్తున్నాడు. అయితే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్ లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది విద్యార్ధినిలు ఉన్నారు. ప్రైవేట్ గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ, ఫోటో షూట్స్, కోచింగ్ వంటి మాయ మాటలతో విద్యార్థినులపై లైంగిక దాడికి శశి కుమార్ పాల్పడుతున్నాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్ కు వెళ్లి విచారించగా విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. తమనూ లైంగికంగా వేధించారని హాస్టల్ లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోయారు. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్‌ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్‌కు సహకరించకపోతే టార్చర్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్‌ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్‌కు సహకరించకపోతే టార్చర్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also : Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eluru Girls Hostel Incident
  • Hostel warden husband
  • physical harassment
  • Sashikumar

Related News

    Latest News

    • KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

    • Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్

    • Vice President : దేశంలోనే అత్యున్నత పదవి.. స్థానం రెండోది అయినా జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    • Nandamuri Balakrishna : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది హీరో బాలకృష్ణ

    • Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd