VV Vinayak : వైసీపీ లోకి డైరెక్టర్ వి.వి. వినాయక్..?
- By Sudheer Published Date - 12:22 PM, Fri - 5 January 24

ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు (MLA & MP Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు (TDP , YCP , Janasena , BJP) తమ ప్రణాళికలతో సిద్ధం అవుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ-జనసేన పార్టీలు ఈసారి విజయ డంఖా మోగించాలని చూస్తున్నాయి. మరోవైపు వైసీపీ సైతం 175 కు 175 సాధించాలని చూస్తుంది. దానికి తగ్గట్లే సన్నాహాలు చేస్తూ..కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కకు పెడుతూ..కొత్తవారికి ఛాన్స్ ఇస్తుంది. కేవలం పొలిటికల్ నేతలనే కాకుండా సినీ గ్లామర్ ను కూడా వాడుకోవాలని చూస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ – జనసేన పార్టీలలో ఎక్కువగా సినీ గ్లామర్ ఉండడం తో వారికీ ఏమాత్రం తగ్గకుండా సినీ స్టార్స్ ను రంగంలోకి దింపాలని చూస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ (Director Vinayak) ను వైసీపీ లోకి చేర్చుకోవాలని చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ధీటుగా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్‌ను వైసీపీ లోకి చేర్చుకోవాలని భావిస్తోందట. కాకినాడ లేదా? ఏలూరు నుంచి ఎంపీగా ఆయన్ను పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్.. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీకి ప్రచారం చేస్తారని ఎవ్వరు అనుకోవడం లేదు. చిరంజీవి ని అన్నయ్య అంటూ ప్రతి నిత్యం తన ప్రేమను , అభిమానాన్ని చాటుకునే వినాయక్..జనసేన , టీడీపీ ని కాదని వైసీపీ లో చేరడం అనేది జరగని పని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ , జనసేన పార్టీలను కాదని పలువురు వైసీపీ లో చేరి పెద్ద తప్పు చేశామని వారంతా ఇప్పటికి ఫీల్ అవుతున్నారని..వారిని చూసైనా ఈసారి ఆ తప్పు ఎవ్వరు చేయరని కామెంట్స్ చేస్తున్నారు. మరి వినాయక్ వైసీపీ లో చేరతారా..? లేదా..? అనేది చూడాలి. ప్రస్తుతం వినాయక్ సినీ కెరియర్ కూడా ఏమాత్రం బాగాలేదు. తెలుగు లో ఎవ్వరు కూడా ఆయనకు ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.. ఆ మధ్య బెల్లం కొండా సాయి శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతిః రీమేక్ చేసి బోల్తా పడ్డాడు.
Read Also : Sajjanar: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు