Vizainagaram Garbage Issue: ఏపీలో పొలిటికల్ ‘చెత్త’ వైరల్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది అపార్ట్ మెంట్ గేటు ముందు చెత్త వేసిన ఘటన వైరల్ అయింది.
- Author : CS Rao
Date : 24-08-2022 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
విజయనగరం జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది అపార్ట్ మెంట్ గేటు ముందు చెత్త వేసిన ఘటన వైరల్ అయింది. అడ్డుకున్న స్థానికులపై మున్సిపల్ సిబ్బంది దాడి చేసే వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్ ధ్వంసం చేశారు. అపార్ట్ మెంట్ దగ్గర ఆందోళనకు దిగిన స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు.
చెత్త పన్ను పేరుతో వైసిపి ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తుంది. చెత్త పన్నేసి కట్టకపోతే సామాన్లు జప్తు చెయ్యడం, ఇంటి ముందు చెత్త వెయ్యడం నిత్యకృత్యంగా మారింది. జగన్ రెడ్డి చెత్త ముఖ్యమంత్రి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ.
విజయనగరం పూల్ బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్మెంట్ వారు చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లి అపార్ట్మెంట్ గేటు ముందు వెయ్యడం దారుణం. దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘చెత్త పన్ను కట్టలేదని గేటు ముందు చెత్త వెయ్యడమే తప్పయితే, ప్రశ్నించి మున్సిపల్ సిబ్బంది దుశ్చర్య ని చిత్రీకరిస్తున్న అపార్ట్మెంట్ వాసి ఫోన్ ధ్వంసం చేసి అక్కడ నివసిస్తున్న వారిపై దాడికి దిగడం హేయమైన చర్య. అపార్ట్మెంట్ ముందు చెత్త వేసి అక్కడ నివసిస్తున్న వారి పై దాడికి పాల్పడిన వారు, ఆదేశాలు జారీ చేసిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకొవాలి. చెత్త సీఎం వెంటనే చెత్త పన్ను రద్దు చెయ్యాలి.’అని ట్వీట్ చేశారు లోకేష్.
చెత్త పన్ను పేరుతో వైసిపి ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తుంది. చెత్త పన్నేసి కట్టకపోతే సామాన్లు జప్తు చెయ్యడం, ఇంటి ముందు చెత్త వెయ్యడం నిత్యకృత్యంగా మారింది. జగన్ రెడ్డి చెత్త ముఖ్యమంత్రి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ.(1/4) pic.twitter.com/Mv6yEb3o7e
— Lokesh Nara (@naralokesh) August 24, 2022