Vizag Married Woman: ‘మిస్సింగ్ కేసు’లో మరో ట్విస్ట్.. సాయిప్రియ ఆడియో వైరల్!
తన భర్తతో కలిసి కనిపించకుండా పోయిన వివాహిత విశాఖపట్నం కేసు కొత్త మలుపు తిరిగింది.
- Author : Balu J
Date : 28-07-2022 - 1:38 IST
Published By : Hashtagu Telugu Desk
తన భర్తతో కలిసి కనిపించకుండా పోయిన వివాహిత విశాఖపట్నం కేసు కొత్త మలుపు తిరిగింది. సాయి ప్రియ అనే వివాహిత తన తండ్రికి వాయిస్ సందేశం పంపింది. తనను వెతకవద్దని అభ్యర్థించింది. బెంగళూరులో ప్రియుడు రవితో కలిసి జీవిస్తున్నానని, తన కోసం వెతకవద్దని తండ్రిని ర్విక్వెస్ట్ చేసింది. ఒకవేళ తనను వెతికితే చనిపోతానని బెదిరించింది. అయితే తన అచూకీ వెతికినందుకు పోలీసులు, నేవీ అధికారులకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయంలో రవి తల్లిదండ్రుల ప్రమేయం లేదని సాయిప్రియ అన్నారు. ఆర్కే బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ తన భార్య కనిపించకుండా పోయిందని సాయిప్రియ భర్త శ్రీనివాస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు రెండు రోజులుగా సహాయక చర్యల్లో మునిగిపోయారు.