Vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు
సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- Author : Balu J
Date : 17-08-2023 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన #VandeBharatExpress ను నేడు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశామని తెలిపింది. ఒకవేళ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. వందేభారత్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఈ రైలులో వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.
వందేభారత్‌లో ఉండే విధంగానే ఈ రైలులోనూ క్యాటరింగ్ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు.మరోవైపు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3గంటలకు విశాఖ బయల్దేరాల్సిన వందేభారత్ కూడా రద్దయింది.
Also Read: Chicken Curry: చికెన్ కర్రీలో చనిపోయిన చిట్టెలుక.. ముంబై రెస్టారెంట్ లో సిబ్బంది నిర్వాకం!