Swami Swaroopananda : మాట మార్చిన శారదా పీఠం స్వరూపానంద..
30 సంవత్సరాలపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ధీమా వ్యక్తం చేసారు. కానీ ఆయన చెప్పింది ఒకటైతే..జరిగింది ఒకటి. దీంతో తన మాట మార్చుకున్నాడు.
- Author : Sudheer
Date : 10-06-2024 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
శారదా పీఠం స్వరూపానంద స్వామి (Vishaka Sri Sarada Peetham swaroopananda Swamy) మాట మార్చారు. మొన్నటి వరకు జగన్ (Jagan) జపం చేసిన ఈయన..ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) ఫై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం మారితే స్వాముల మాటలు కూడా మారతాయని స్వరూపానంద నిరూపించారు. మొన్నటి వరకు ఈయన జగన్ జపం చేసారు..జగన్ అధికారంలోకి రావాలని యాగాలు చేసారు..30 సంవత్సరాలపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ధీమా వ్యక్తం చేసారు. కానీ ఆయన చెప్పింది ఒకటైతే..జరిగింది ఒకటి. దీంతో తన మాట మార్చుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం సంతోషం ఉందన్నారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని , ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో శారదా పీఠానికి స్థలం ఉందని, అక్కడ దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తాను ఆశిస్తున్నానని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హయాంలో దేవాదాయశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను టిడిపి పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకం కాదని, తన వ్యక్తిత్వం పెద్దలకు తెలుసని, ఒకరికి భయపడి ఈ సమావేశాన్ని తాను ఏర్పాటు చేయలేదని స్వరూపానంద వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గతంలో తాను మురళీమోహన్ గెలవాలంటూ రాజమండ్రిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే గత ప్రభుత్వం నుంచి విశాఖ శారదాపీఠం పెద్ద ఎత్తున భూములను పొందింది. వాటిని కాపాడుకోవడానికే స్వరూపానంద ప్లేటు ఫిరాయించారంటున్నారు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
Read Also : B. Shivadhar Reddy : తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డికి ఛాన్స్..?