Visakha Honey Trap: విశాఖ హనీట్రాప్ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు
- Author : Kode Mohan Sai
Date : 07-10-2024 - 1:40 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ హనీట్రాప్ కేసు(Visakha Honey Trap)లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి . దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
భాగ్యనగరం కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అందమైన యువతుల ఫొటోలతో కుర్రాళ్లను ఆకర్షించి, సోషల్ మీడియా ద్వారా వారిని తమ ఉచ్చులో చిక్కుకునేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు మాదక ద్రవ్యాలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత యువతులు వారితో సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీస్తారు.
ఆ తర్వాత ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం చేశారు. తద్వారా వారి నుంచి భారీ మొత్తంలో వారి దగ్గర డబ్బులు వసూలు చేశారు. తమ ప్రైవేట్ ఫొటోలు బయటకు వస్తే పరువుపోతుందన్న భయంతో బాధితులు ఆన్‌లైన్ ద్వారా భారీగా డబ్బులు సమర్పించుకున్నారు. వారికీ చెల్లించుకున్నారు.
ఈ మొత్తం, వ్యవహారంలో చాలా మంది యువకులు చిక్కుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆన్‌లైన్ లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. వారి నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును త్వరలోనే కొలిక్కి తీసుకువస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.