AP : ఆధార్ కార్డు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం
ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
- By Sudheer Published Date - 04:24 PM, Wed - 18 October 23

ఏపీ(AP)లో మరో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిఫై వాలంటీర్ అత్యాచారం (Village Volunteer Rapes Tenth Student) చేసాడు. ఈ ఘటన ఏలూరు(Eluru district)లో చోటుచేసుకుంది. ఇప్పటికే వాలంటీర్‌ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తుంటే..వారి ఆరోపణలను ఎప్పటికప్పుడు నిజం చేస్తున్నారు కొంతమంది వాలంటీర్‌లు. ఇప్పటీకే పలువురిఫై అత్యాచారాలు , హత్యలు చేసి వార్తల్లో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వెళ్లి.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట వాలంటీర్ నీలాపు శివకుమార్ (Volunteer Shivakumar). తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో.. అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు.. ఆ తల్లిదండ్రుల దగ్గర వాయిపోయిందట విద్యార్థిని.. దీంతో.. వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. శివకుమార్‌పై కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also : AP News: అనంతపురం జిల్లాలో అంబులెన్సల కొరత, బైక్ పై బాలుడు శవం తరలింపు