Durga Temple : బెజవాడ దుర్గగుడిలో అపచారం.. మద్యం మత్తులో..?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. ఆలయ ప్రతిష్టను సెక్యూరిటీ ఏజెన్సీ దెబ్బతీస్తుంది..........
- By Prasad Published Date - 03:43 PM, Wed - 28 September 22

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. ఆలయ ప్రతిష్టను సెక్యూరిటీ ఏజెన్సీ దెబ్బతీస్తుంది. దసరా ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సయమంలో ఆలయంలో విధులు నిర్వర్తించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది మద్యం మత్తులో ఊగుతున్నారు. మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఇంఛార్జ్ చంద్రపై ఈవో భ్రమరాంభ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో రౌండ్స్‌కి వచ్చిన సమయంలో ఈవోని పట్టించుకోకపోవడంతో సెక్యూరిటీ ఇంఛార్జ్ చంద్రపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఇంఛార్జ్ చంద్ర ని వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో కూడా సెక్యూరిటీ ఏజెన్సీపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఇంఛార్జ్ మద్యం మత్తులో విధులకు రావడం.. ఈవో భ్రమరాంబకు దొరకడంతో ఇప్పటికైనా ఏజెన్సీపై చర్యలు తీసుకుంటారో లేదో అన్న అనుమానం కలిగిస్తుంది. ఈ వ్యవహారాన్ని ఈవో భ్రమరాంభ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.