YCP : రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం – విజయసాయి రెడ్డి
YCP : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్ధం చేస్తుందని, రాష్ట్రంలో అప్పటికీ మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని
- By Sudheer Published Date - 04:07 PM, Sun - 3 November 24

రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేసారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్ధం చేస్తుందని, రాష్ట్రంలో అప్పటికీ మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వైసీపీ కేడర్ ఇప్పుడు నుంచే బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నదని, ఈ సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ నిర్మాణాన్ని మరింత బలపరుస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ నాయకులపై అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని, ముఖ్యంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Amaran Collections : మూడు రోజుల్లో రూ.100 కోట్లను క్రాస్ చేసిన ‘అమరన్’