HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddy Re Entry To Ycp

Vijayasai Reddy : వైసీపీలోకి విజయసాయి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

Vijayasai Reddy : విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను జగన్‌కు సమర్పించినట్లు సమాచారం.

  • Author : Sudheer Date : 03-07-2025 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Ree Entry
Vijayasai Ree Entry

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి పేరు (Vijayasai Reddy) వినిపిస్తేనే వైఎస్ జగన్ సమీపవర్గం గుర్తుకు వస్తుంది. జగన్‌తో ఆయనకు ఉన్న సన్నిహితత, పార్టీ వ్యవహారాల్లో ఆయనకు ఉన్న ప్రాధాన్యత కారణంగా, ఒకప్పుడే ఆయనను వైసీపీలో “నెంబర్ 2″గా కూడా పిలిచేవారు. జగన్ (Vijayasai Reddy) వద్దకు వెళ్లాలంటే ముందుగా విజయసాయి రెడ్డిని కలవాల్సిందే అనే స్థాయికి వెళ్లిన ఆయన, అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపారు. పార్టీ ఓటమికి కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీలే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో, వైసీపీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.

KCR Hospitalised : అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

వైసీపీ నేతలపై ఆరోపణలు, తనకు జరిగిన అవమానాల గురించి విజయసాయి రెడ్డి ఎంతగానో స్పందించినా, తన విమర్శలు ఎక్కడా జగన్ వ్యక్తిగతంగా కాక, ఆయన చుట్టూ ఉన్న వర్గంపై మాత్రమేనన్నది స్పష్టమైంది. పార్టీ కష్టకాలంలో తాను ఎలా పోరాడానో గుర్తు చేస్తూ, తనపై లిక్కర్ స్కామ్, టీడీపీతో సంబంధాలు వంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అవసరమైతే నోరు విప్పి అనేక మంది జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. ఆలా హెచ్చరించిన విజయసాయి..ఇప్పుడు అదే వైసీపీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను జగన్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆయన తిరిగి రావడం తనకు అభ్యంతరం లేదని తెలిపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాయిరెడ్డితో కూడా కొందరు కీలక నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విజయసాయి రెడ్డి లేదా వైఎస్సార్సీపీ నాయకత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పుడే ఈ రాజకీయ నాటకానికి ఓ క్లారిటీ అనేది వస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Vijayasai reddy
  • Vijayasai Reddy Re Entry
  • Vijayasai Reddy Re Entry news
  • ycp

Related News

Kiraak Rp Tdp

Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

రాజకీయాల్లో నాయకులు పదవుల కోసం, విమర్శల కోసం ఒకరినొకరు తిట్టుకున్నా, సమయం వచ్చినప్పుడు మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ, వారిని మెప్పించడానికి లేదా డబ్బు కోసం, పదవుల కోసం నోరు పారేసుకునే కిర్రాక్ ఆర్పీ వంటి వారు తమ స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తే భవిష్యత్తులో అది వారి వ్యక్తిగత జీవితానికే కాకుండా,

  • Kakani Notice

    విచారణకు రావాలని కాకాణికి నోటీసులు

  • Duvvada Jagan

    దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd