Vijayasai Reddy : వైసీపీలోకి విజయసాయి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను జగన్‌కు సమర్పించినట్లు సమాచారం.
- By Sudheer Published Date - 07:57 PM, Thu - 3 July 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి పేరు (Vijayasai Reddy) వినిపిస్తేనే వైఎస్ జగన్ సమీపవర్గం గుర్తుకు వస్తుంది. జగన్‌తో ఆయనకు ఉన్న సన్నిహితత, పార్టీ వ్యవహారాల్లో ఆయనకు ఉన్న ప్రాధాన్యత కారణంగా, ఒకప్పుడే ఆయనను వైసీపీలో “నెంబర్ 2″గా కూడా పిలిచేవారు. జగన్ (Vijayasai Reddy) వద్దకు వెళ్లాలంటే ముందుగా విజయసాయి రెడ్డిని కలవాల్సిందే అనే స్థాయికి వెళ్లిన ఆయన, అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపారు. పార్టీ ఓటమికి కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీలే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో, వైసీపీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
KCR Hospitalised : అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
వైసీపీ నేతలపై ఆరోపణలు, తనకు జరిగిన అవమానాల గురించి విజయసాయి రెడ్డి ఎంతగానో స్పందించినా, తన విమర్శలు ఎక్కడా జగన్ వ్యక్తిగతంగా కాక, ఆయన చుట్టూ ఉన్న వర్గంపై మాత్రమేనన్నది స్పష్టమైంది. పార్టీ కష్టకాలంలో తాను ఎలా పోరాడానో గుర్తు చేస్తూ, తనపై లిక్కర్ స్కామ్, టీడీపీతో సంబంధాలు వంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అవసరమైతే నోరు విప్పి అనేక మంది జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. ఆలా హెచ్చరించిన విజయసాయి..ఇప్పుడు అదే వైసీపీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను జగన్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆయన తిరిగి రావడం తనకు అభ్యంతరం లేదని తెలిపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాయిరెడ్డితో కూడా కొందరు కీలక నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విజయసాయి రెడ్డి లేదా వైఎస్సార్సీపీ నాయకత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పుడే ఈ రాజకీయ నాటకానికి ఓ క్లారిటీ అనేది వస్తుంది.