SVSN వర్మ..వైసీపీ తో టచ్ లో ఉన్నాడా..? ముద్రగడ కూతురి షాకింగ్ కామెంట్స్
SVSN Varma : గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం పిఠాపురం సీటును వదులుకున్న వర్మకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
- By Sudheer Published Date - 04:03 PM, Sat - 29 March 25

ఏపీ రాజకీయాల్లో SVSN వర్మ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం పిఠాపురం సీటును వదులుకున్న వర్మకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా వర్మకు ఈ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనికి కారణమంటూ ప్రచారం జరుగుతుండగా, ముద్రగడ పద్మనాభం కుమార్తె, జనసేన నాయకురాలు క్రాంతి బార్లపూడి దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవిపై వర్మ టీడీపీతోనే తేల్చుకోవాలని, పవన్ కళ్యాణ్‌ను ఇరికించేందుకు ప్రయత్నించడం సరికాదని తేల్చిచెప్పారు.
Sensational Allegation : అతడు ఒకే రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడట: సీనియర్ డైరెక్టర్ వంశీ
క్రాంతి బార్లపూడి వర్మపై మరింత సీరియస్‌గా స్పందిస్తూ.. “మీ పార్టీ మీకు పదవి ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోకుండా జనసేనపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం?” అని ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారాన్ని సమర్థించేలా వైసీపీ అనుకూల మీడియా వర్మను హైలైట్ చేస్తోందని ఆమె ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ కష్టకాలంలో నిలబడి మద్దతు ఇచ్చి, కూటమి విజయం కోసం పాటుపడ్డారని ఆమె గుర్తుచేశారు. పవన్ ఓటమి తరువాత కూడా కూటమి ఐక్యత కోసం త్యాగాలు చేసినట్టు తెలిపారు. వర్మ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్‌పై ఆరోపణలు చేయడం అసలు మంచిది కాదని స్పష్టం చేశారు.
ఈ మొత్తం వివాదంలో వర్మ వైఖరిపై టీడీపీ, జనసేన వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అసంతృప్తిని వైసీపీ వాడుకునే ప్రయత్నం చేస్తోందా? లేక వర్మ నిజంగానే ఆ పార్టీతో టచ్‌లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వల్లే పిఠాపురం అభివృద్ధి సాధ్యమవుతుందని, జనసేన అభిమానులు వర్మను నమ్మే పరిస్థితి లేదని క్రాంతి స్పష్టం చేశారు. చివరగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల త్యాగాలను గుర్తించకుండా కేవలం ఒక పదవి రాలేదనే కోపంతో కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని హెచ్చరించారు.