TTD: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం వేడుకలు, విశేష అలంకరణలో అమ్మవారు దర్శనం
వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి.
- Author : Balu J
Date : 25-08-2023 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
TTD: తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేకాలు శాస్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారు బంగారుచీరలో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పద్మావతీ అమ్మవారి (Ammavaru) ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు.
అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువం, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో ఆరాధించారు. అధిక సంఖ్యలో భక్తులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ… ఆలయ ప్రాంగణంలో శాస్రోక్తంగా సామాహిక వ్రతాలు నిర్వహించామన్నారు. పూజలకు అవసరమైన సామాగ్రితో పాటు… పూజలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులను దేవాలయం అందించిందన్నారు. శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కలశాన్ని ఏర్పాటు చేసి.. విశేష పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు అర్ధగిరిస్వామి తెలిపారు.
Also Read: Rajinikanth: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జైలర్, 525 కోట్లు వసూలు చేసిన రజనీ మూవీ!