Vangaveeti Radha : వంగవీటి రాధా కు గుండెపోటు..?
Vangaveeti Radha Admit To Hospital : ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన
- By Sudheer Published Date - 10:15 AM, Thu - 26 September 24

Vangaveeti Radha Heart Attack : టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) అనారోగ్యానికి గురయ్యారు. ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని సడెన్ గా కుప్పకూలారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు…విజయవాడ లోని ప్రవైట్ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. స్వల్పంగా గుండెపోటు (Heart Attack) వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ తెలిపినట్లు తెలుస్తుంది. మరో 48 గంటల పర్యవేక్షణలో ఉండాలని రాధా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది. వంగవీటి రాధా అనారోగ్యం విషయం తెలియగానే ఆయన అభిమానులు ఇంటికి చేరుకున్నారు. రాధాకు ఏమైందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని చెప్పడంతో అక్కడి ఆసుపత్రికి వెళ్లారు. కొద్దిరోజులు వంగవీటి రాధా యాక్టివ్‌గా లేరని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటె… మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న వంగవీటి రాధా.. ఆ తర్వాత కూటమి కి సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ.. 2004 సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి… విజయం సాధించడం జరిగింది. ఆ సమయంలో బిజెపి అభ్యర్థి పైన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ప్రజారాజ్యం, వైసిపి పార్టీలు తిరిగి చివరికి మళ్ళీ…టీడీపీ పార్టీలో చేరారు.
Read Also : Arka Arunika : అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్స్ రెడీ.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ