Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi : విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది
- Author : Sudheer
Date : 29-05-2025 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ (Vamsi Bail) మంజూరు చేసింది. వంశీ అనారోగ్యం (Vamsi is sick
)తో బాధపడుతుండటంతో ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మెరుగైన వైద్యం అవసరమని వాదనలు వినిపించగా, కోర్టు ఆయనకు తక్షణ వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ, వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Gruhini Scheme : కాపు మహిళల కోసం చంద్రబాబు సరికొత్త పథకం
విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది. వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సదుపాయాలు లేవని వాదించడంతో, హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. వంశీకి మెరుగైన వైద్యం అందించేందుకు ఏ ఆసుపత్రిని ఎంపిక చేశారో వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.
Mahanadu : కడప గడ్డ పై చంద్రబాబు మాస్ వార్నింగ్
కస్టడీలో ఉన్న సమయంలో వంశీ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. శరీరం బలహీనంగా మారి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. నోటికి రుమాలు అడ్డగా పెట్టుకుని దగ్గుతుండటం చూసి ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్న భావన కలిగింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబానికి తాత్కాలిక ఊరట లభించినట్లు చెప్పవచ్చు.