HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two Youths Remanded In Vijayawada Thar Car Case

VIJAYAWADA : బెజ‌వాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్

 Vijayawada : బెజ‌వాడలో థార్ కారు కేసులో ఇద్ద‌రు యువ‌కులను రిమాండ్‌కు త‌ర‌లించారు. రాజ‌కీయ అండ‌దండ‌లున్న‌ప్ప‌టికీ..

  • Author : Prasad Date : 24-05-2026 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada thar car gang war
Vijayawada thar car gang war

Vijayawada : బెజ‌వాడలో థార్ కారు కేసులో ఇద్ద‌రు యువ‌కులను రిమాండ్‌కు త‌ర‌లించారు. రాజ‌కీయ అండ‌దండ‌లున్న‌ప్ప‌టికీ పోలీసులు త‌లొగ్గ‌కుండా ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. నడిరోడ్డుపై రౌడీయిజం చేసిన ఈ ఇద్ద‌రు యువకులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పటమట హైటెన్షన్ రోడ్డుపై రాత్రి పూట థార్ (THAR CAR) కార్లతో రణరంగం సృష్టించారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న బెజ‌వాడ‌ పోలీసులు ఇద్ద‌రి య‌వ‌కుల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. డ్రగ్స్ మత్తులో, ఒకే అమ్మాయి కోసం స్నేహితులే శత్రువులుగా మారి బెజ‌వాడ రోడ్ల‌పై స్వైర విహారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రంతుల‌కు గురి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హాజ‌రుప‌రిచారు. నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రని విజ‌య‌వాడ జిల్లా జైలుకు త‌ర‌లించారు

ఈ కేసులో ఏ1 గా బొల్లా ఓం (బొల్లా ఓంకార్) ని చేర్చ‌గా.. ఏ2గా రోహిత్ లింగ‌మ‌నేనిని చేర్చారు. బొల్లా ఓంకార్‌కు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో అత‌నిపై నార్కోటిక్ కేసు కూడా పోలీసులు న‌మోదు చేశారు. ఏ2గా ఉన్న రోహిత్ లింగమనేని.. ఘటనా స్థలం నుండి పారిపోవాలని చూసినా, చట్టం వదల్లేదు. కారులో జిమ్ బాడీ కోసం వాడే స్టెరాయిడ్స్, ఈ-సిగరెట్లతో రోహిత్ అడ్డంగా దొరికిపోయాడు కేవలం కార్లు గుద్దుకోవడంతోనే ఈ వ్యవహారం ముగియలేదు. వీరి కార్లను తనిఖీ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు దొరికాయి. ఒకరి కారులో హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు బయటపడితే… మరొకరి కారులో ఏకంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు దొరకడం విజయవాడలో కలకలం రేపుతోంది. ఏ1 బొల్లా ఓంకార్ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ పేరు, వైకాపా రాజకీయ బలగం ఉందంటూ ప్రచారం సాగినప్పటికీ… పోలీసులు ఎక్కడా తగ్గలేదు. పటమట నివాసితుల గుండెల్లో భయం పుట్టించిన ఈ ‘థార్ గ్యాంగ్’కు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసుల ప‌నితీరుపై స్థానికులు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gang War
  • Mahindra Thar Car
  • vijayawada
  • Vijayawada police

Related News

Fight in the Middle of the Road Over a Girl

Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇద్దరు యువకులు

    Latest News

    • VIJAYAWADA : బెజ‌వాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్

    • Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd