HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd Registers Case Against One More Fake Website

TTD: టీటీడీని పోలిన మరో నకిలీ వెబ్ సైట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

టీటీడీ (TTD) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ (Fake Website)ని టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Author : Gopi Date : 23-04-2023 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Tirupati Devastanam Ttd
Tirumala Tirupati Devastanam Ttd

టీటీడీ (TTD) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ (Fake Website)ని టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. FIR 19/2023 U/S 420, 468, 471 IPC ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్ సైట్లపై కేసులు నమోదు చేశారు.

అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని అధికారులు కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు.

Also Read: Covid Cases: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 67 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

@TTDevasthanams పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను TTD IT విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. FIR 19/2023 U/S 420, 468, 471 IPC ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. pic.twitter.com/xwOl0oPDYw

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 23, 2023

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నిరకాల టిక్కెట్లను ఆన్ లైన్ లోనే టీటీడీ కేటాయిస్తుంది. దీంతో టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లతో మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లపై టీటీడీ ఐటీ శాఖ గత కొంతకాలంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడా టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లు వస్తూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని టీటీడీ భక్తులు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Fake Website
  • Tirumala Tirupati Devasthanam
  • ttd
  • TTD IT

Related News

'Made in Jonnagiri' gold enters the market.

Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ నుంచి గోల్డ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్‌ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌తో పాటుగా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్‌ బజారుకు చెందిన కొందరు వ్యాపా

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd