Tirupati Stampede : తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..!!
Tirupati Stampede : తొక్కిసలాటలో గాయపడిన భక్తులను తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో పరామర్శించారు
- By Sudheer Published Date - 12:27 PM, Thu - 9 January 25

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల్లో బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede ) ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో పరామర్శించారు. డీఎస్పీ గేట్లు తీయడం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన చెప్పుకొచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన చికిత్స అందించేందుకు వైద్యులతో చర్చించారు.
E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్
కొందరికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది గాయపడ్డారని, అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు ఈవో తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రాణాపాయం లేదని, అవసరమైన అన్ని వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని , పూర్తి వివరాలు విచారణ పూర్తైన తర్వాత వెల్లడించనున్నట్లు చెప్పారు.
TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
ఇక తొక్కిసలాట ఘటన లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం నష్టపరిహారాన్ని ప్రకటించారు.