TTD : పార్వేటి మండపం కూల్చివేత, శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు.. స్పందించిన టిటిడి ఈవో ధర్మారెడ్డి..
పార్వేటి మండపం కూల్చివేతపై దారుణంగా వ్యతిరేకత వచ్చింది. తాజాగా టిటిడి ఈఓ ధర్మారెడ్డి(Dharma Reddy) మీడియాతో మాట్లాడుతూ వీటిపై స్పందించారు.
- By News Desk Published Date - 11:39 AM, Sun - 16 July 23

ఇటీవల తిరుమల(Tirumala)లో పార్వేటి మండపం(Parveti Mandapam) కూల్చివేతపై, శ్రీవాణి ట్రస్టు(Sreevani Trust)పై విపక్ష నాయకులు, పలువురు హిందూ సంఘాలు విమర్శలు చేశారు. ఇక పార్వేటి మండపం కూల్చివేతపై దారుణంగా వ్యతిరేకత వచ్చింది. తాజాగా టిటిడి ఈఓ ధర్మారెడ్డి(Dharma Reddy) మీడియాతో మాట్లాడుతూ వీటిపై స్పందించారు.
టిటిడి ఈఓ ధర్మారెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కొంత మంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంభద్దమైన ఆరోపణలు చేశారు కొంతమంది. అవన్నీ అబద్దాలు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నాం. దేవాదాయ శాఖ, టిటిడి, ఆలయ కమిటిలు, సమరసత్తా స్వచ్చంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తూన్నాం. పార్వేటి మండపం శిధిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్దారణ చేస్తూన్నాం అని తెలిపారు.
అలాగే.. ఆగస్టు, సెప్టంబర్ నెలకు సంభందించి రోజుకి 4 వేల చోప్పున అదనపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల చేస్తాం అని తెలిపారు.
Also Read : Tomatoes: భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న టమాటా ధరలు.. ఈ నగరాల్లో మాత్రం కిలో టమాటా 90 రూపాయలే..!