Jeevan Reddy : జీవన్ రెడ్డిని బుజ్జగించేపనిలో TPCC చీఫ్
Jeevan Reddy : కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన అన్నారు
- By Sudheer Published Date - 02:16 PM, Tue - 22 October 24

కాంగ్రెస్ పార్టీ (Congress ) లో అలకలు అనేవి ఈనాటివి కావు..అధికారంలో ఉన్న , ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో నేతలమధ్య విభేదాలు అనేవి నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కూడా ఇదే లొల్లి నడుస్తుంది. ఎవరికీ వారే గ్రూప్ రాజకీయాలు చేస్తూ అధిష్టానం మెప్పు కోసం ట్రై చేస్తూ ఉంటారు. బయటకు అంత కలిసినట్లు కనిపించిన..వెనుకాల మాత్రం తమదైన రాజకీయాలు చేస్తుంటారు. ఒకరి పై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకోవడం , పోలీస్ స్టేషన్ లలో పిర్యాదులు చేయడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy ) హాట్ వ్యాఖ్యలు చేసారు. తాజాగా జీవన్ రెడ్డి అనుచరుడ్ని దారుణంగా హత్య చేసారు. ఈ ఘటన పట్ల జీవన్ రెడ్డి తీవ్ర అసంతృత్తి వ్యక్తం చేసారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన అన్నారు. అవమానించారు, మానసికంగా వేధించారు.. అయినా భరించామన్నారు. కనీసం మమ్మల్ని బతకనివ్వరా అంటూ జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా.. ఇక నేను కాంగ్రెస్ లో ఉండలేను.. భౌతికంగా నిర్మూలిస్తుంటే పార్టీలో ఎందుకుండాలంటూ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు..
ఈ క్రమంలో జీవన్ రెడ్డి కి TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫోన్ చేశారు. తన విషయంలో పార్టీ పెద్దల తీరుపై జీవన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. కాగా 40ఏళ్లు తాను కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషికి తగిన బహుమానం ఇచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మహేష్ కుమార్ మాట్లాడుతుండగానే ఆయన ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : Inland Water Tourism Excellence Award 2024 : మధ్యప్రదేశ్ టూరిజం బోర్డుకు అరుదైన అవార్డు