SSC Hall Tickets : ‘టెన్త్’ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి రిలీజ్ కానున్నాయి.
- By Pasha Published Date - 09:08 AM, Mon - 4 March 24

SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి రిలీజ్ కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను జారీ చేస్తారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోంపేజీలో ‘AP SSC హాల్‌టికెట్లు’ (SSC Hall Tickets) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతో పాటు తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
టెన్త్ పరీక్షల తేదీలివీ..
మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
➥ మార్చి 18 : ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 19 : సెకండ్ లాంగ్వేజ్
➥ మార్చి 20 : ఇంగ్లిష్
➥ మార్చి 22 : మ్యాథమెటిక్స్
➥ మార్చి 23 : ఫిజికల్ సైన్స్
➥ మార్చి 26 : బయాలజీ
➥ మార్చి 27 : సోషల్ స్టడీస్ పరీక్షలు
➥ మార్చి 28 : మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్‌ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
➥ మార్చి 30 : ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
Also Read : PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..
ఈ ఏడాది నుంచి 7 పేపర్ల విధానం
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది 6 పేపర్లతో నిర్వహించారు. ఈ ఏడాది నుంచి 7 పేపర్ల విధానాన్ని అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులను సాధిస్తే పాసైనట్టే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి.
బస్సులో ఉచిత ప్రయాణం
పదోతరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు.. పరీక్ష రాశాక ఇళ్లకు ఉచితంగా వెళ్లొచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.