HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tiruvuru Tdp Politics

Tiruvuru TDP : ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. టికెట్‌పై ఆశ‌లు..!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైంది.

  • Author : Prasad Date : 17-02-2023 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Mlas
Tdp Mlas

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైంది. జిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట అయిన‌ప్ప‌టికీ గ‌త నాలుగు ప‌ర్యాయాలుగా ఓడిపోవాల్సి వ‌చ్చింది. 2004 నుంచి 2019 వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. 2009, 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల‌తో మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ఓడిపోయారు. ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి జ‌వ‌హార్ ను తిరువూరు నుంచి పోటీ చేపించారు. చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇవ్వ‌డం.. ఎవ‌రు పోటీ చేస్తార‌నేది క్లారిటీ రాక‌పోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో ఆయ‌న కూడా ఓడిపోయారు. ఆ త‌రువాత జ‌వ‌హార్ మ‌ళ్లీ కొవ్వూరు వైపే చూస్తున్నారు. అయితే తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక నేత‌ల్ని కాద‌ని అధిష్టానం నాన్‌లోక‌ల్ వ్యక్తిని తీసుకువ‌చ్చి ఇంచార్జ్‌గా నియ‌మించింది. తిరువూరులో ఓ కార్పోరేట్ ఆసుప‌త్రి నిర్వాహ‌కుడు శావ‌ల దేవ‌ద‌త్‌ని ఇంఛార్జ్‌గా పెట్టింది అధిష్టానం.

అయితే అప్ప‌టికే క‌ల‌హాల కాపురంగా ఉన్న తిరువూరు టీడీపీలో విభేదాలు మ‌రింత పెరిగాయి. ఇంఛార్జ్ వ‌చ్చి రెండేళ్లు గ‌డుస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ పుంజుకోలేదనే భావ‌న క్యాడ‌ర్‌లో వ‌చ్చింది. టికెట్ ఆశిస్తున్న వారితో కూడా ఇంఛార్జ్ స‌ఖ్య‌త‌గా ఉండ‌టం లేదనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల టికెట్ ఆశిస్తున్న జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య‌, ఇత‌ర వ్య‌క్తుల‌పై ఇంఛార్జ్ అనుచ‌రులు సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుల‌పై పెద్ద దుమారం రేగింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో దీనిపై ర‌చ్చ జ‌రిగింది. పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్‌, ప‌రిశీల‌కుడు చిట్టిబాబు స‌మ‌క్షంలో ఈ అంశాన్ని లేవ‌నెత్తి స‌ద‌రు సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్‌ని స‌స్పెండ్ చేశారు.

ఇటీవ‌ల కాలంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఎక్క‌డ కార్య‌క్ర‌మాలు ఉన్నా అంద‌రికంటే ముందుగానే వెళ్తున్నారు. గ‌తంలో కార్య‌క్ర‌మాల‌కు లేట్‌గా వ‌చ్చే స్వామిదాస్ ముందుగానే ప్రోగ్రాంల‌కు రావ‌డం క్యాడ‌ర్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. పార్టీ స‌మావేశాల్లో సైతం తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌పై ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డ ఎమ్మెల్యే ఓడిపోవాలి.. చంద్ర‌బాబు మాత్రం ముఖ్య‌మంత్రి కావాల‌నే ధోర‌ణి తిరువూరు నాయ‌కుల‌కు ఉంద‌ని.. ఎన్నిక‌లంటే ఇక్క‌డి నాయ‌కులు పండుగ‌లాంటిదంటూ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మూడు సార్లు తాను ఓడుపోతూ వ‌చ్చాన‌ని.. నాలుగోసారి సానుభూతితో గెలిచే అవ‌కాశం ఉన్న చివ‌రి నిమిషంలో త‌న‌కు టికెట్ రాకుండా చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో తిరువూరులో 30వేల మెజార్టీ వ‌స్తుంద‌ని చెప్పుకోవ‌డం పేప‌ర్ల‌కే త‌ప్ప గ్రౌండ్ లెవ‌ల్‌లో లేద‌న్నారు. అంద‌రు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే వెయ్యి, రెండు వేల ఓట్ల‌తో బ‌య‌ట‌ప‌డ‌తామంటూ మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ తెలిపారు.

స్వామిదాస్ ఇటీవ‌లకాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు, స‌మావేశాల్లో ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటే తాను మ‌ళ్లీ పోటీ చేస్తున్నానంటూ క్యాడ‌ర్‌కి సంకేతాలు పంపిస్తున్నారు. త‌న అనుచ‌రులు వ‌ద్ద కూడా స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని.. అయితే త‌న‌కు కానీ.. జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య కానీ టికెట్ ఇవ్వాల‌ని స‌న్నిహితుల‌తో అంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రీ ఎన్నిక‌ల్లో అధిష్టానం ఎవ‌రికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/02/WhatsApp-Video-2023-02-17-at-7.37.35-AM.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • EX MLA swamidas
  • tdp
  • tiruvuru

Related News

Massive public meeting on the alliance's two-year rule

Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నా

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Central government showering blessings on Amaravati

    Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

Latest News

  • AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త

  • Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

  • Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

  • Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • Tobacco: పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd