Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
- Author : Hashtag U
Date : 17-11-2021 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
తిరుమల: నేడు, రేపు రెండు నడకదారుల మూసివేత… భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు ముందస్తుగా నడకదారులు మూసివేత- టిటిడి pic.twitter.com/2hLlCfCDuT
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 17, 2021
గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టికి ఇప్పటికే తిరుమల మెట్ల మార్గంతో పాటు రోడ్డు మార్గంలో కూడా చాలా చోట్ల దెబ్బతింది. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు కురవనుండటంతో భక్తులను ఇతర రవాణా మార్గాలు చూసుకోవాల్సిందిగా టిటిడి సూచించింది.