Tirupathi : పులివర్తి నాని ఫై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
తిరుపతిలో నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 09:25 PM, Tue - 14 May 24

తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి (Chandragiri ) నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani)పై వైసీపీ రౌడీ మూక చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు , నారా లోకేష్. నిన్న పోలింగ్ రోజు నానా బీబత్సం సృష్టించిన వైసీపీ శ్రేణులు.. ఈరోజు అలాగే కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani)పై దాడి చేసారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లి.. తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో దాడి చేయగా, ఓ బండరాయి నాని ఛాతికి బలంగా తగిలింది. ప్రాణాపాయం నుంచి నాని త్రుటిలో తప్పించుకోగా అడ్డుకున్న గన్‌మెన్ ధరణిపైనా దాడి జరిగింది. దీంతో ఆయన ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక నాని కారును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం నాని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడిని చంద్రబాబు , లోకేష్ లు తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు అంటూ మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని ప్రశ్నించారు. తిరుపతిలో నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
“పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను” అని నారా లోకేశ్ ట్విటర్ (X)లో పోస్టు పెట్టారు.
తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు… pic.twitter.com/4H5im5dMrc
— N Chandrababu Naidu (@ncbn) May 14, 2024
చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో
వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన… pic.twitter.com/l6DeM2OgMs— Lokesh Nara (@naralokesh) May 14, 2024
Read Also : Amit Shah: కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం : అమిత్ షా