TTD : భక్తులకు అలర్ట్… ఆ రెండురోజులు శ్రీవారి ఆలయం మూసివేత..!!
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. వచ్చే రెండు నెలల్లో రెండురోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
- By hashtagu Published Date - 07:27 PM, Wed - 7 September 22

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. వచ్చే రెండు నెలల్లో రెండురోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కారణం ఏంటంటే సూర్య, చంద్రగ్రహణం వల్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడుతున్నందున ఉదయం 8.11గంటల నుంచి రాత్రి 7.30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక నవంబర్ 8 వ తేదీని చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు కూడా ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయశుద్ధి నిర్వహించి ఆలయాన్ని తెరవనున్నారు.
సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా ఈ రెండు రోజుల్లో అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతి ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని….ఈ సమాచారం ప్రకారం దర్శనానికి ప్రణాళిక వేసుకోవాలని టీటీడీ సూచించింది.