Tension Tension : తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు
Tension Tension : గోశాలకు మద్దతుగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకోవడం మరోమారు ఉద్రిక్తతకు దారి తీసింది.
- Author : Sudheer
Date : 17-04-2025 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతి(Tirupathi)లో గోశాల(Goshala)లపై ఏర్పడిన వివాదంతో రాజకీయ వేడి చెలరేగింది. వైసీపీ నేతలు గోశాలకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) నేతృత్వంలో వైసీపీ శ్రేణులు గోశాలకు ర్యాలీగా బయలుదేరాయి. వారికి మద్దతుగా వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా హాజరయ్యారు. అయితే ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
Sandeep Sharma: ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన సందీప్ శర్మ.. ఇంతకుముందు కూడా ఇలాగే!
పోలీసుల తీరుతో ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. భూమన ర్యాలీని ఆపడం అన్యాయం అంటూ స్థానిక నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికే ర్యాలీ నిర్వహించామనీ, అడ్డుకోవడం తగదని వారు పేర్కొన్నారు. మద్దతుగా వచ్చిన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, ఇది రైతులు, పశువుల సంక్షేమం కోసం తీసుకున్న చర్య అని అన్నారు.
ఇక గోశాలకు మద్దతుగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకోవడం మరోమారు ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల జోక్యం వల్ల పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ప్రాంతంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రశాంతత కోరుతున్నారు.