Times Now Exit Poll : వైసీపీకి 117-125 సీట్లు
మరికొద్ది గంటల్లో ఏపీలో ఎవరు విజయం సాదించబోతున్నారు..? ఎవరి మెజార్టీ ఎంత..? అధికార పార్టీ విజయం సాదించబోతుందా..? కూటమి విజయం సాధిస్తుందా..? అనేది తేలనుంది
- By Sudheer Published Date - 10:06 AM, Mon - 3 June 24

మరికొద్ది గంటల్లో ఏపీలో ఎవరు విజయం సాదించబోతున్నారు..? ఎవరి మెజార్టీ ఎంత..? అధికార పార్టీ విజయం సాదించబోతుందా..? కూటమి విజయం సాధిస్తుందా..? అనేది తేలనుంది. ఇదే క్రమంలో పలు ఎగ్జిట్ పోల్స్ ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో ఎన్నికల వేడి సాగింది. నువ్వా..నేనా అన్నట్లు కూటమి vs వైసీపీ పోరు జరిగింది. ఈ పోరులో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తుంది. శనివారం విడుదలైన మెజార్టీ పోల్స్ కూటమి విజయం సాదిస్తుందని తెలుపగా..ఇదే సందర్భంలో లోకల్ సంస్థలు మరోసారి ప్రజలు జగన్ కే పట్టం కట్టబోతున్నారని తెలిపాయి. దీంతో ఎవరి సర్వే నిజం అవుతుందో అని ఆసక్తి పెరుగుతూ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారని టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది. 51 శాతం ఓట్లతో YCPకి 117-125 సీట్లు, 47 శాతం ఓట్లతో NDAకు 50-58 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవడం ఫలితాలపై ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఈ సర్వే ను వైసీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తూ జగన్ మరోసారి సీఎం కాబోతున్నాడని పోస్టులు పెడుతున్నారు.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రం కూటమిదే విజయం అని తేల్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. జనసేన 16 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలవొచ్చని అంచనా వేసింది. వైసీపీ 55 నుంచి 77 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కూటమి 175 స్థానాలకు గానూ.. 98-120 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అటు అధికార వైసీపీ 55-77, కాంగ్రెస్ 0-2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది అని పేర్కొంది. పార్టీల పరంగా చూస్తే టీడీపీకి 42 శాతం, వైసీపీకి 44 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. జనసేనకు 7 శాతం, బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లు రావచ్చని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఎంపీ సీట్లకు సంబంధించి కూడా టీడీపీ కూటమికి 21 సీట్లు రావచ్చని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. టీడీపీ 13-15, జనసేన 2, బీజేపీ 4-6 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని.. వైసీపీ 2 నుంచి 4 ఎంపీ సీట్లు రావచ్చని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మరి ఎవరి సర్వే నిజం అవుతుందో..ఎవరు అధికారంలోకి వస్తారో..మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
Read Also : Pooja Hegde : పూజా ఎట్టకేలకు సాధించేసింది..!