Ganesh Immersion : నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు మృతి
Ganesh Immersion : గణేశుడిని ఇంటికి తీసుకువచ్చిన అదే ఆనందం, ఉత్సాహంతో వీడ్కోలు పలుకుతున్నారు. వెళ్ళిరా బొజ్జ గణపయ్య అంటూ ఆనందంగా వీడ్కోలు పలుకుతూ... మళ్ళీ వచ్చే ఏడాది మరింత ప్రేమ, ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు తీసుకురమ్మని కోరుకుంటూ జై భోలో గణేష్ మహరాజ్ కి జై అని అంటూ నిమజ్జనం చేస్తున్నారు. కాగా
- Author : Sudheer
Date : 09-09-2024 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
Three dead in separate Ganesh Immersion : దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల (Ganesh Navratri) సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వివిధ రకాల్లో గణనాధుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేడు మూడో రోజు కావడం తో పలు చోట్ల నిమజ్జన (Ganesh Immersion)కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణేశుడిని ఇంటికి తీసుకువచ్చిన అదే ఆనందం, ఉత్సాహంతో వీడ్కోలు పలుకుతున్నారు. వెళ్ళిరా బొజ్జ గణపయ్య అంటూ ఆనందంగా వీడ్కోలు పలుకుతూ… మళ్ళీ వచ్చే ఏడాది మరింత ప్రేమ, ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు తీసుకురమ్మని కోరుకుంటూ జై భోలో గణేష్ మహరాజ్ కి జై అని అంటూ నిమజ్జనం చేస్తున్నారు. కాగా పలుచోట్ల గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంటున్న ఘటనలు ఆయా కుటుంబాల్లోని కాదు భక్తుల్లో విషాదం నింపుతున్నాయి.
తాజాగా అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లి వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక కడప జిల్లా చక్రాయపేట మండలంలో నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా.. ట్రాక్టర్ కిందపడి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి మృతితో అతడి కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. వాకాడు మండలం తూపులి పాలెంలో వినాయకుని నిమజ్జనం చేస్తూ బంగాళాఖాతంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నాయుడుపేటలోని కావమ్మ గుడి సెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్, శ్రీనివాసులుగా స్థానికులు గుర్తించారు. శ్రీనివాసులును మెరైన్ పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఫయాజ్ మృతి చెందగా.. గల్లంతైన మునిరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also : Pawan Kalyan – Gollaprolu : జ్వరంతో బాధపడుతూ కూడా పవన్ పర్యటన