Banks Merged : మే 1 నుంచి ఆ నాల్గు బ్యాంకులు కనిపించవు
Banks Merged : బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి, వ్యవస్థను సమీకరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 09:43 AM, Tue - 29 April 25

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మే 1 నుంచి విలీనం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB), ఆంధ్రప్రదేశ్ గృహీణ వికారాబాద్ బ్యాంక్ (APGVB), చిత్తూరు గ్రామీణ బ్యాంక్ (CGGB), శ్రీకాకుళం గ్రామీణ బ్యాంక్ (SGB)లు ఒక్కటిగా విలీనం అయి, “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్” (Andhra Pradesh Grameena Bank) పేరిట కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి, వ్యవస్థను సమీకరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Terrorist Attack : కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
విలీనానికి సంబంధించి బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాతా నంబర్లు, IFSC కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. కస్టమర్లు తమ పాత చెక్ బుక్స్, పాస్ బుక్స్, ATM కార్డులను యథాతథంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇది కేవలం పరిపాలనా మార్పే అయినందున, వారి బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టీకరించారు.
అదనపు సమాచారం లేదా సహాయం అవసరమైతే, కస్టమర్లు సమీపంలోని బ్యాంకు శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. అన్ని శాఖలలో ప్రత్యేక సాయం కౌంటర్లు ఏర్పాటు చేసి, ఖాతాదారులకు మార్పులు, సేవల వివరాలపై స్పష్టమైన సమాచారం అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత వేగవంతం కావడం, టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తరించడమే ఈ విలీన ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.