HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >This Is The First Time In My Life That I Have Faced So Many Challenges Cbn

CBN : నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి – చంద్రబాబు

CBN : తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోందని, ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు

  • Author : Sudheer Date : 11-02-2025 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu's key comments on the 8-month coalition rule
CM Chandrababu's key comments on the 8-month coalition rule

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ పరిపాలనలో వేగాన్ని పెంచే చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోందని, ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి, కూటమికి పూర్తి మెజారిటీతో అధికారాన్ని అప్పగించారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, వాటిని మళ్లీ గాడిలో పెట్టడం తన ముందున్న అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు.

Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైళ్లు ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థిక సంబంధిత ఫైళ్లు కూడా అవసరమైన సమీక్షల అనంతరం త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ సమర్పించిన నివేదిక ప్రకారం.. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు మూడు రోజుల్లోనే క్లియర్ అవుతున్నాయి. కానీ మరికొన్ని శాఖల్లో మాత్రం ఫైళ్లకు నెలల తరబడి ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఇది పరిపాలనా వ్యవస్థలో అడ్డంకిగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అధికారులు ఫైళ్లను అనవసరంగా నిలిపివేయకుండా, అవి సమయానికి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థంగా నడిపేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Key Comments
  • ycp

Related News

Rambabu Comments

రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

  • Bail Granted To Chevireddy

    చెవిరెడ్డి భాస్కర్‌ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్‌

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd