HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Policy Of Working For The Welfare Of The State Should Come From Everyone Pawan

Pawan Kalyan : రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలి – పవన్

Pawan Kalyan : ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాలసీలు రూపొందించడం పాలకుల ప్రధాన బాధ్యత. అయితే, ఆ పాలసీలను ప్రజలకు చేరవేసే కార్యం కార్యనిర్వాహక వ్యవస్థ చేతులపై ఉంటుంది

  • Author : Sudheer Date : 11-12-2024 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan district tour
pawan kalyan district tour

రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). బుధువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం (District Collectors meeting
) సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ..ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాలసీలు రూపొందించడం పాలకుల ప్రధాన బాధ్యత. అయితే, ఆ పాలసీలను ప్రజలకు చేరవేసే కార్యం కార్యనిర్వాహక వ్యవస్థ చేతులపై ఉంటుంది. గత ఐదేళ్లలో ఈ పాలసీ పూర్తిగా విస్మరించబడింది. ప్రజాస్వామ్య విరుద్ధమైన పాలన వల్ల సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులను తట్టుకుని, ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే విధంగా పాలన సాగించేందుకు ప్రజల ఆశీర్వాదాన్ని పొందామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ కాలంలో నిబంధనలను పక్కన పెట్టి నిర్వాకం సాగిందని, కార్యనిర్వాహక వ్యవస్థలో సైతం ఆ నిస్సహాయత స్పష్టంగా కన్పించిందని పవన్ వ్యాఖ్యానించారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి ప్రజల తరఫున పోరాడిన అనుభవాలను పంచుకున్నారు. ఇసుక, మద్యం అమ్మకాల వంటి అంశాల్లో జరిగిన అక్రమాలు చూసినా స్పందించని పరిస్థితి అప్పట్లో కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సివిల్స్ పాసై ఉన్నత స్థాయి శిక్షణ పొందిన అధికారులు కూడా ఆ సమయంలో మౌనం వహించడం బాధ కలిగించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సిరియా, శ్రీలంక వంటి దేశాల్లో పాలకులు విఫలమైనప్పటికీ కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా నిలబడి ప్రజలకు సేవలందించిందని, ఇక్కడ కూడా అలాంటి చిత్తశుద్ధి అవసరమని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

Read Also :  Jagan : రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా మొదలైంది – జగన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • District Collectors meeting
  • Pawan Kalyan
  • Pawan Speech

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd