Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్
Nuzvid IIIT : సండే హాలిడే.. ఎంజాయ్ చేద్దామని ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు.
- By Pasha Published Date - 02:35 PM, Sun - 17 December 23
Nuzvid IIIT : సండే హాలిడే.. ఎంజాయ్ చేద్దామని ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్‌కు వెళ్లారు. స్నానం కోసం వాళ్లంతా సముద్రంలోకి దిగారు. ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఆ అలలు వాళ్లను లాక్కెళ్లిపోయాయి. విద్యార్థులంతా అలల్లో కొట్టుకుపోతుండటాన్ని అక్కడున్న మెరైన్ పోలీసులు(Nuzvid IIIT) వెంటనే గమనించారు.
We’re now on WhatsApp. Click to Join.
మెరైన్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఎంతో సాహసోపేత చొరవ చూపి అలల్లో కొట్టుకుపోతున్న నలుగురు విద్యార్థులను ప్రాణాలతో కాపాడారు. తోకల అఖిల్ అనే విద్యార్థి గల్లంతవగా.. అతడి ఆచూకీ కోసం గాలించారు. చివరకు మంగినపూడి బీచ్‌లో అఖిల్ మృతదేహం లభ్యమైంది. దీంతో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది.