Vijayawada Railway Restaurant : విజయవాడలో తొలి రైల్వే రెస్టారెంట్.. ‘హల్దీరామ్స్ ఆన్ వీల్స్’
Vijayawada Railway Restaurant : విజయవాడలో ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువ.
- Author : Pasha
Date : 22-09-2023 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayawada Railway Restaurant : విజయవాడలో ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువ. వారి కోసం సెంట్రల్ రైల్వేస్ సరికొత్త ఏర్పాటు చేసింది. సాంప్రదాయ చిరుతిళ్లు, స్వీట్లను తయారు చేసే హల్దీరామ్స్ ఆంధ్రప్రదేశ్‌లో తన మొదటి అవుట్‌లెట్ ‘హల్దీరామ్స్ ఆన్ వీల్స్’ ని విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో సెప్టెంబర్ 19న ప్రారంభించింది. నాగ్‌పూర్ తర్వాత హల్దీరామ్స్ ట్రైన్ థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభమైన దేశంలోని రెండో నగరం విజయవాడ మాత్రమే. ఈ ట్రైన్ రెస్టారెంట్ లోపల సీటింగ్ కెపాసిటీ 46 కాగా, కోచ్ బయట స్థలంలో 64 సీటింగ్ కెపాసిటీ ఉంది. భారతదేశంలోని అన్ని రుచులను ఒకే చోట తినాలంటే ఈ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే.
Also read : Oral Health During Pregnancy: గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండిలా.. లేకుంటే ప్రమాదమే..!
నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ, టిఫిన్స్, నాన్ వెజ్ బిర్యానీ సహా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి. స్నాక్స్ తో ముందుగా మొదలుపెడితే ఎన్నో రకాల దోసలను, దాల్ రైస్, వెజ్ కర్రీస్, శాండ్విచ్ లు, ఇండియన్ బ్రెడ్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ లను ఈ ట్రైన్ రెస్టారెంట్ లో అమ్ముతుంటారు. ఈ హోటల్ లో సర్వీసింగ్, సిట్టింగ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ‘టేక్ అవే’ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. జొమాటో, స్విగ్గీ యాప్స్ ద్వారా సైతం ఆర్డర్స్ ఇవ్వొచ్చు. ఫుడ్ లవర్స్ ఇక్కడి ప్రశాంత వాతావరణంలో నచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ (Vijayawada Railway Restaurant) చేస్తున్నారు. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం వేళ భోజనం, సాయంత్రం వేళ చిరుతిండ్లు, రాత్రి ఢిన్నర్ ఇలా ప్రతి ఆహారంలో కొత్తదనాన్ని ఈ రెస్టారెంట్ లో చూడొచ్చు.