Effect of White Papers : చంద్రబాబు శ్వేతపత్రాల ఎఫెక్ట్ ..ఆ పార్టీ వైపు వైసీపీ నేతల ఫోకస్..?
చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా తమ గుట్టును బయటపెడుతుండడంతో వైసీపీ నేతల్లో భయం , ఆందోళన పెరుగుతుంది. ఇలాగే కొనసాగితే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడం , కనిపిస్తే చెప్పుతో కొట్టడం కూడా చేస్తారని వారంతా మాట్లాడుకుంటున్నారు
- By Sudheer Published Date - 03:58 PM, Tue - 16 July 24

ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు (CHandrababu)..సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి వరుసగా శ్వేతపత్రాలను (White Papers) విడుదల చేస్తూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతలు దోచుకున్న భూములు , దాచుకున్న డబ్బు , కొట్టేసిన చెట్లు , కాల్చేసిన విద్యుత్తూ వంటివి బయట పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం , అమరావతి , విద్యుత్తూ వంటి వాటిపై శ్వేతపత్రాలను విడుదల చేసి సంచలన నిజాలు బయటపెట్టారు. ఇవే కాదు గురువారం నుండి వరుసగా మరో మూడు శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నారు. గురువారం శాంతిభద్రతలు, మహిళల రక్షణపై, శుక్రవారం మరో అంశంపై, శనివారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు
We’re now on WhatsApp. Click to Join.
ఇలా చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా తమ గుట్టును బయటపెడుతుండడంతో వైసీపీ నేతల్లో (YCP Leaders) భయం , ఆందోళన పెరుగుతుంది. ఇలాగే కొనసాగితే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడం , కనిపిస్తే చెప్పుతో కొట్టడం కూడా చేస్తారని వారంతా మాట్లాడుకుంటున్నారు. అధికారం తమ చేతిలో ఉంది..వచ్చేసారి కూడా మనదే అధికారం అని ఈగో తో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ప్రజల సొమ్మును వారి జేబుల్లో వేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి వారి అభివృద్ధిని పెంచుకోవడం చేసారు. ఇక ఇప్పుడు అధికారం కూటమి చేతుల్లోకి వెళ్లడం తో అన్ని బయటకు తీస్తున్నారు. ఇక ఇప్పుడు ఏంచేయాలో అనేది అర్ధం కానీ పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇందులో నుండి బయట పడాలంటే అధికార పార్టీ లోకి వెళ్ళాలి కానీ టిడిపి , అటు జనసేన రెండు కూడా ఎట్టి పరిస్థితిల్లో తమను చేర్చుకోరు..ఇక ఉన్నది ఒక బిజెపి మాత్రమే. బిజెపి కి రాష్ట్రంలో పెద్దగా నేతలు లేరు..సో ఆ పార్టీ కచ్చితంగా చేర్చుకుంటుంది. బిజెపి ఎలాగూ కూటమిలో భాగమే కావడంతో వారి జాతకాలు బయట పడే ఛాన్స్ లేదు..సో బిజెపి పార్టీనే తమను ఆదుకునేది అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బుగ్గన ఆ పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షించాలని చంద్రబాబు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ, తెలివిగా వైసీపీ నేతలు రక్షణ కోసం బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి నేతలను బీజేపీ చేర్చుకుంటే, చంద్రబాబు చేస్తోన్న కృషి నిష్ప్రయోజనమే అవుతుంది. అందుకే ఆర్థిక నేరాలకు , భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలకు బీజేపీలో ఆశ్రయం కల్పించవద్దని ఇప్పటి నుండే బాబు అధిష్టానానికి చెపుతున్నారు. చూద్దాం మరి బాబు మాట నిలబడుతుందా..లేదా అనేది.
Read Also : BRS : బిఆర్ఎస్ నేతలంతా పార్టీని వీడడానికి అసలు కారణం అతడేనా..?