HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ten Percent Polling In 2 Hours In Andhra Pradesh Women Voters Cue In Polling Stations

AP Elections : భారీ పోలింగ్ దిశగా ఏపీ.. 2 గంటల్లోనే పది శాతం ఓటింగ్

AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు(AP Elections) పోటెత్తుతున్నారు.

  • Author : Pasha Date : 13-05-2024 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Elections
Ap Elections

AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు(AP Elections) పోటెత్తుతున్నారు. దీంతో భారీగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 10 శాతం పోలింగ్‌ నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join

ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. 

ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విజ‌య‌వాడ తూర్పులో అత్యధికంగా 12 శాతం ఓటింగ్ జరిగింది. జగ్గయ్యపేటలో 11 శాతం, విజ‌య‌వాడ ప‌శ్చిమలో 11 శాతం పోలింగ్ నమోదైంది.  తిరువూరులో 10 శాతం,  ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9.18 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం, తిరుపతి జిల్లాలో 8.11 శాతం, విజ‌య‌వాడ సెంట్రల్‌లో 8.09 శాతం ఓటింగ్ జరిగింది. సత్యసాయి జిల్లా లో 6.92 శాతం, శ్రీశైలంలో 6.21 శాతం,  మైల‌వ‌రంలో 6 శాతం, బనగానపల్లిలో 5.32 శాతం, నంద్యాలలో 5.22 శాతం, నంద్యాల జిల్లాలో 5.10 శాతం పోలింగ్ నమోదైంది. నందిగామలో 4.46 శాతం, ఆళ్లగడ్డలో  4.90 శాతం, డోన్‌లో 4.75 శాతం, నందికొట్కూర్‌లో 4.29 శాతం ఓటింగ్ జరిగింది. పల్నాడు లాంటి ప్రాంతాల్లో పలు పోలింగ్ స్టేషన్ల వద్ద కొంతమేర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది.

Also Read :Putin : రష్యా రక్షణ మంత్రి ఔట్.. పుతిన్ సంచలన నిర్ణయం

ఏపీలోని పల్నాడు జిల్లాలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో టిడిపి, వైసీపీ నేతలు గాయపడ్డారు. అలాగే రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటన ఫై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Rahul Gandhi : కేంద్రంలో జూన్‌4న ఇండియా కూటమి ప్రభుత్వం: రాహుల్‌ ధీమా

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రారంభం కాగానే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓటింగ్ కోసం 46,389 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, ఇందులో 4.14 కోట్ల మంది ఓటర్లు 2,841 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Elections
  • Polling Stations
  • women voters

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd