Atchannaidu: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి: అచ్చెన్నాయుడు
రేవంత్ ప్రజల్లో ఉంటూ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అచ్చెన్నాయుడు కొనియాడారు.
- By Balu J Published Date - 03:47 PM, Thu - 7 December 23
Atchannaidu: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ప్రజల్లో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అచ్చెన్నాయుడు కొనియాడారు. రేవంత్ తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, పరాజయాలు చవిచూశారని, గెలుపు ఓటములను ఎదుర్కొన్నారని అన్నారు.
రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఎ. రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అభినందించారు.
రాష్ట్ర పురోగతి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. X లో పోస్ట్ లో ప్రధాన మంత్రి, “తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర పురోగతి మరియు పౌరుల సంక్షేమం కోసం నేను అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇస్తున్నాను.” అంటూ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు