Yeluri Sambasiva Rao: హ్యట్రిక్ కొట్టేందకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీ యువ ఎమ్మెల్యే
- By HashtagU Desk Published Date - 09:14 AM, Fri - 11 March 22

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ తన సత్తా చాటింది. నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. ఆ తరువాత అధికార పార్టీలోకి జిల్లా నుంచి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రమే వెళ్లారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడున్నారు. ఈ జిల్లాలో పర్చూరు ని యోజకవర్గంలో టీడీపీ నుంచి గెలవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు పై ఏలూరి సాంబశివరావు విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు
పర్చూరు నియోజకవర్గం దగ్గుబాటి కుటుంబానికి కంచుకోటగా ఉండేది. 1983, 1985, 1989 లో అసెంబ్లీకి ప్రాతినద్యం వహించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తరువాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.2014 రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లోమ ఆయన కుమారుడిని పోటీ చేయాలని భావించిన సాంకేతికకారణాలతో ఆయన పోటీ నుంచి తప్పకున్నారు.దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉంటే టీడీపీ నుంచి వరుసగా రెండుస్లార్టు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో తనదైన ముంద్ర వేసుకున్నారు. అధికారంలో ఉన్పప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువైయ్యారు. ప్రతిపక్షంలో సైతం తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా ఏలూరి సాంబశివరావు ఉన్నారు. దేశంలో అత్యుత్తమ యువ ఎమ్మెల్యేగా ఏలూరి అవార్డును అందుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటున్నారు.
ఇటు టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీడీపీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో విజయంసాధించి పర్చూరుపై మూడోసారి టీడీపీ జెండా ఎగరేసేలా యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పావులు కదుపుతున్నారు. టీడీపీ క్యాడర్ కూడా ముచ్చటగా మూడోసారి గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.