MP Gorantla Madhav : ఢిల్లీ వైసీపీ సమావేశంలో దర్జాగా ఎంపీ గోరంట్ల
అశ్లీల వీడియోతో దొరికిపోయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ వేదికగా ఏ మాత్రం తడబాటు లేకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్నాడు.
- Author : CS Rao
Date : 06-08-2022 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
అశ్లీల వీడియోతో దొరికిపోయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ వేదికగా ఏ మాత్రం తడబాటు లేకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్నాడు. సహచర ఎంపీల ముందు ఏ మాత్రం సిగ్గుపడకుండా నిలబడ్డాడు. మహిళతో నగ్నంగా వ్యవహరించిన మాధవ్ పై ఎలాంటి చర్యలు వైసీపీ తీసుకోలేదు. పైగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఠీవీగా ఆయన కూర్చున్నాడు.
ఢిల్లీలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరు కావడం పెద్ద న్యూస్ అయింది. ఆయన వాలకంపై టీడీపీ మండిపడింది. ‘దేశం సిగ్గు పడే పని చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేసేలా వైసీపీ లీకులు ఇచ్చింది. సీన్ కట్ చేస్తే, శనివారం జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన ఆయనకు ప్రత్యేక కుర్చీ వేసి కూర్చోపెట్టారు.` సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ?’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాధవ్ హాజరైన ఫోటోను కూడా టీడీపీ పోస్ట్ చేసింది.
దేశం సిగ్గు పడే పని చేసిన గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేస్తున్నాం అని లీకులు ఇచ్చారు.. కట్ చేస్తే, ఈ రోజు ఢిల్లీలో పార్టీ సమావేశాలకు ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారు.
సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ?#YcpMpDirtyPicture #YCPMPsexScandal#WhoRemovedLungi pic.twitter.com/yrqMF1xg9V
— Telugu Desam Party (@JaiTDP) August 5, 2022
ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఆరోపణలు రావడం, దానిని ఆయన మార్ఫింగ్ వీడియో అంటూ ఖండించడం విదితమే. ఇదంతా దుమారం రేగినప్పటికీ వైసీపీ సమావేశంలో ఆయన పాల్గొనడం ఒక ఎత్తు. పైగా ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా ఆ సమావేశంలో కనిపించడం మరో విశేషం.