HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Strategic Committee Meeting Held In Vijayawada

YS Jagan : ‘అప‌రిచితుడు బాదుడే బాదుడు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ని అప‌రిచితుడిగా అభివ‌ర్ణించిన చంద్ర‌బాబునాయుడు `బాదుడేబాదుడు` గురించి ఫైర్ అయ్యాడు.

  • Author : Hashtag U Date : 18-04-2022 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu And Jagan
Babu And Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ని అప‌రిచితుడిగా అభివ‌ర్ణించిన చంద్ర‌బాబునాయుడు `బాదుడేబాదుడు` గురించి ఫైర్ అయ్యాడు. నెల్లూరు కోర్టులోని మంత్రి కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్స్ అగ్నికి ద‌గ్ధం కావ‌డం అరాచ‌క పాల‌న‌కు పరాకాష్ట‌ని బాబు ఆరోపించారు. టీడీపీ నిర్వహిస్తున్న `బాదుడే బాదుడు` నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే జ‌గ‌న్ మోస‌పు రెడ్డి పాల‌న‌కు ప్ర‌త్య‌క్ష సాక్ష్య‌మంటూ వివ‌రించారు. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను రివర్స్ చేశారని మండిపడ్డారు. ఒక అపరిచితునిలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని అంచ‌నా వేశారు. పార్టీ స్ట్రాట‌జీ క‌మిటీలో ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించిన చంద్ర‌బాబు జ‌గ‌న్ పరిపాల‌న అంతా రివ‌ర్స్ అంటూ విమ‌ర్శించారు.జగన్ ఎంత బలహీనుడో అతని క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థం అవుతోందని చంద్రబాబు అన్నారు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందని అభిప్రాయ‌ప‌డ్డారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. పోలవరం విషయంలో మొదటి నుంచి జగన్ తీసుకున్న తప్పుడు, రివర్స్ నిర్ణయాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయని చంద్రబాబు అన్నారు. రివర్స్ టెండర్ల నిర్ణయం, పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా 2020 లో పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. రివర్స్ టెండర్లలో ప్రజాధనం ఆదా అని గొప్పలు చెప్పిన జగన్ ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్ల జరిగిన నష్టానికే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు అని చంద్రబాబు అన్నారు.
ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కూడా కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా రూ.100 కోట్లు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అందజేశారు.

స్ట్రాటజీ కమిటీలో చర్చించిన అంశాలు:-

1.నెల్లూరు కోర్టులో దొంగలు పడిన అంశంలో ముమ్మాటికీ మంత్రి కాకాని ప్రమేయం ఉందని పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. దొంగతనం విషయంలో పోలీసు ఉన్నతధికారులు ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని, నిజాలను దాస్తున్నట్లు ఉందని స్ట్రాటజీ కమిటీలో నేతలు అభిప్రాయపడ్డారు. కోర్టులో దొంగలు పడిన వ్యవహారంపై పోరాటం చెయ్యాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరును నేతలు తప్పు పట్టారు. జగన్ ను ఆరాధించాలి అని సమాచార శాఖా మంత్రి వేణగోపాలకృష్ణ చెప్పడాన్ని తప్పు పట్టారు. కళ్యాణదుర్గంలో మంత్రి తన ఆర్భాటంతో పసిబిడ్డ ప్రాణం తియ్యడమే కాకుండా నిరసన తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని నేతలు ఖండించారు.
2.ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న సాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమే అని నేతలు విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నిత్యం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
3. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టాను అని చెప్పిన జగ న్ ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నేతలు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకలో బాలికపై వాలంటీర్ అత్యాచారం చేసిన ఘటనను నేతలు ఖండిచారు.
4.బాదుడే బాదుకు కార్యక్రమం సందర్భంగా పల్లెల్లో చేస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని నేతలు వివరించారు. పన్నుల భారం, చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల వంటి విషయాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలు ఉంటాయని చంద్రబాబు నేతలకు వివరించారు. త్వరలోనే వీటిని ప్రారంభిచనున్నట్లు వివరించారు. ఇకపోతే వచ్చే మహానాడు ఎక్కడ నిర్వహించాలి అనే అంశంలో నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరోలో కూడా చర్చించిన తరవాత మహానాడు నిర్వహణ ఎక్కడ అనేది ప్రకటించనున్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • TDP chandrababu naidu
  • telugu desam party
  • YS Jagan Mohan Reddy

Related News

TDP MLA MADHAVI REDDY

TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ, పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డి పేర్కొన్నారు. యువనేత నారా లోకేష్ చేసిన ఈ ప్రకటన మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాట్లాడటమే కాకుండా..

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd